దుఆ – జియారత్

ఇస్లాం

ఇస్లాం అల్లాహ్ క పసందీద దీన్ హై

“దీన్” అరబీ భాషకు చెందిన పదం. దీన్ అనగా ధర్మం. ధర్మం అనగా ఆలోచన, విశ్వాసం, మార్గం మరియు రీతి; అది సత్యమార్గం కానివ్వండి లేదా మిథ్య మార్గం కానివ్వండి. ఖుర్ఆన్ విగ్రాహారాధన చేసేవారి గురించి ఇలా ఉపదేశించెను:

“మీ ధర్మం మీది, నా ధర్మం నాది”[1] ఈ విధంగా, ప్రతీ ఒక్కరి మార్గం, రీతి మరియు నమ్మకాలు వార్వారి దీన్ (ధర్మం) అని తెలుస్తుంది. ప్రధానమైన మరియు ముఖ్యమైన విషయమేమిటంటే ఏ మార్గాన్ని అనుచరిస్తున్నాము. సత్య మార్గాన్నా లేక మిథ్యమార్గాన్నా అన్న విషయంపై స్పష్టత కలిగి ఉండడం చాలా అవసరం.


[1]. సూరయె కాఫిరూన్, ఆయత్6.

నిజమైన ధర్మం యొక్క సంకేతాలు

అల్లాహ్ పై నమ్మకం ఉంచడం

1. నిజమైన ధర్మం, బుద్ధివివేకాలకు అనుకూలంగా ఉంటుంది

విగ్రాహారాధనలు చేసేవారు రాయి మరియు చెక్కలను విగ్రహాలుగా చెక్కి వాటిని పూజించేవారు. ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది:

వారితో అతనిలా అన్నాడు: “ఏమిటి? మీరు(మీ స్వహస్తాలతో) చెక్కిన శిలలను పూజిస్తారా?”[1]

ఈ మిథ్యమార్గాన్ని బహుశ మా పూర్వీకులు కూడా అనుచరించి ఉండ వచ్చు, కాని మేము వారి అడుగుజాడలలో నడిచి అదే మార్గంపై నడవ కూడదు; ఎందుకంటే విగ్రాహారధకులు తాము చేసిన కార్యానికి సాకుగా ఇలా అనేవారు:

“మేము మా తాతముత్తాతలను ఒక పద్ధతిపై ఉండటం చూశాము. మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము”[2]

2. నిజమైన ధర్మం, సృష్టికర్త తరపు నుంచి నియమించబడి ఉండాలి ఇతరుల తరపు నుంచి కాదు.

ఈ ఉదాహారణను గమనించండి; ఒక కంపెనీ నుంచి తయారు అయి బజారులో ప్రవేశబెట్టే ప్రతీ పరికరం మరియు సాధనంతో పాటు సాధారణంగా Manual ఉంటుంది, అందులో పరికరాన్ని ఎలా ఉపయోగించాలో వివరించబడి ఉంటుంది.

మానవులను అల్లాహ్[3] సృష్టించాడు, అల్లాహ్ ద్వార అవతరింపబడిన ఆకాశ గ్రంథం రూపంలో వారి మార్గదర్శకం కోసం కూడా Manual ఉంది. ఒక పరికరాన్ని డిజైన్ చేసిన వారే దాని Manual కూడా లిఖించినట్లు, మన జీవన విధానం యొక్క ప్రణాలిక కూడా మనల్ని సృష్టించిన, మన అవసరాలు బాగా తెలిసిన మరియు కష్టాల

ను దూరం చేసే శక్తి కలిగివున్న ఆ అల్లాహ్‌యే ఇవ్వాలి.


[1]. సూరయె సాఫ్ఫాత్, ఆయత్95.

[2]. సూరయె జుఖ్రుఫ్, ఆయత్23.

[3]. దేవుని కొరకు ఉపయోగించే అరబిక్ పదం.

Scroll to Top